: ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు


ఈ నెల 16 నుంచి తెలంగాణా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. జీఎస్టీ బిల్లుతో పాటు, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్లపై చర్చ నిర్వహించేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చనున్నారని తెలుస్తోంది. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లపై ప్రత్యేక కమిటీని నియమించిన ముఖ్యమంత్రి...ఆ కమిటీలు అందజేసిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, శాసనసభ్యులతో చర్చించి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News