: ‘ధన్ ధ‌నాధ‌న్’ ఆఫర్‌ ప్ర‌క‌టించిన రిల‌య‌న్స్ జియో!


స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌ను ఉప‌సంహ‌రించుకున్న రిల‌య‌న్స్ జియో కొత్త టారీఫ్‌ ప్లాన్‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఇటీవ‌ల వెల్లడించిన విష‌యం తెలిసిందే. 'ధన్ ధ‌నాధ‌న్' ఆఫ‌ర్‌ పేరిట ఈ రోజు ఆ ఆఫ‌ర్ల వివ‌రాలు ప్ర‌క‌టించింది.  
 
రిల‌య‌న్స్ జియో ఈ రోజు ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల వివ‌రాలు...
ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకున్న వారికి
రూ.309తో రీచార్జితో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌ ( 84 రోజుల వ్యాలిడిటీ)
రూ. 509తో రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ (84 రోజుల వ్యాలిడిటీ)

ప్రైమ్ స‌భ్య‌త్వం తీసుకోని వారికి
రూ. 408 రీచార్జితో  రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)
రూ. 608 రీచార్జితో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్  (84 రోజుల వ్యాలిడిటీ)

టెలికాం రంగంలో అడుగుపెట్టింది మొదలు జియో ఒకదాని వెంట మరో ఆఫర్లు గుప్పిస్తూ ఎవ్వరూ ఊహించనంతగా కస్టమర్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట వెల్ కం ఆఫర్, ఆ తరువాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట మొత్తం ఆరు నెలల పాటు పూర్తిగా ఉచిత డేటా, కాల్స్ సర్వీసుని అందించిన జియో ఈ నెల 16 నుంచి టారీఫ్ ప్లాన్ లను అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ప్రకటించిన స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఆఫ‌ర్‌పై ట్రాయ్ అభ్యంతరం తెలపడంతో జియో ఆ ఆఫర్ కి బదులుగా టారీఫ్ ప్లాన్లలో భాగంగా ధన్ ధనా ధన్ ఆఫర్ ను తీసుకొచ్చింది.  



  • Loading...

More Telugu News