: బాలకృష్ణకు రూ.10 లక్షల చెక్కు అందించిన ‘జనతా గ్యారేజ్’ టీమ్!
ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్, మోహన్ లాల్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదల సమయంలో ‘జనతా గ్యారేజ్ బైక్ కాంటెస్ట్’ను నిర్వహించగా ఆ బైక్‌ను ఇటీవలే నల్గొండకు చెందిన ఓ అభిమాని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కాంటెస్ట్ ద్వారా సమీకరించిన రూ.10 లక్షల చెక్కును ఆ చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చింది. ఆ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఈ చెక్‌ను అందజేశారు. జనతా గ్యారేజ్ సినిమా దర్శకుడు కొరటాల శివ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.