: సినీ నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు
ప్రముఖ సినీ నటి రాధిక ఆఫీసుపై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడి చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, తన సొంత నిర్మాణ సంస్థ రాడాన్ ద్వారా ఆమె సీరియల్స్ ను, సినిమాలను నిర్మిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఆమె భర్త, నటుడు శరత్ కుమార్ నివాసంపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే శరత్ కుమార్ ప్రస్తుతం శశికళ వర్గానికి మద్దతుగా ఉన్నారు. రాధిక కార్యాలయంపై జరుగుతున్న సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.