: కశ్మీర్ లోనూ ఉప ఎన్నికలు వాయిదా వేయాలి: సుబ్రహ్మణ్యస్వామి


కశ్మీర్ లో హింసాత్మక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అక్కడ శాంతి నెలకొనే వరకూ రెండేళ్ల పాటు ఉప ఎన్నికలు వాయిదా వేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికను రద్దు చేసిన ఎన్నికల సంఘం కశ్మీర్లో కూడా రెండేళ్ల పాటు ఎన్నికలు రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ లో శాంతి, భద్రతలు అదుపులోకి తెచ్చే నిమిత్తం సాయుధ బలగాలను అక్కడికి పంపించాలని, అప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తాయని అన్నారు. కాగా, రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన ఉప ఎన్నికలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. దీంతో, అనంత్ నాగ్ లో రేపు జరగాల్సిన ఉప ఎన్నిక వాయిదా పడింది.

  • Loading...

More Telugu News