: టెండూల్కర్, రేఖ ఈ విషయంలో కూడా టాపే!


అగ్రశ్రేణి క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్, టాప్ హీరోయిన్ గా రేఖ తమ తమ రంగాల్లో ఓ ఊపు ఊపారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రపతి కోటాలో వీరిద్దరూ పెద్దల సభలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా వీరిద్దరూ టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్నారు. అయితే, ఉత్తమ ఎంపీలుగా కాదు... ఎక్కువ రోజులు సభకు డుమ్మాకొట్టిన ఎంపీలుగా! తాజాగా విడుదల చేసిన అటెండెంట్స్ లో చివరి రెండు స్థానాలు వీరిద్దరివే.

348 రోజుల్లో రేఖ కేవలం 18 రోజులు మాత్రమే సభకు హాజరైంది. సచిన్ కొంచెం బెటర్... 23 రోజులు హాజరయ్యాడు. ఇదే విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ రాజ్యసభలో ఇటీవల లేవనెత్తారు కూడా. ఈ ఇద్దరూ ఎన్నడూ సభలో కనిపించరేంటి అధ్యక్షా? అని ఆయన ప్రశ్నించారు. ఇంకో విషయం తెలుసా... ఇప్పటి వరకు రాజ్యసభలో రేఖ కేవలం ఒక ప్రశ్నను మాత్రమే లేవనెత్తింది. సచిన్ మాత్రం 22 ప్రశ్నలు అడిగాడు. 

  • Loading...

More Telugu News