: పెళ్లి చేసుకొని న్యూజిలాండ్‌ వెళ్లిపోయాడు.. న్యాయం చేయండి: ట‌్విట్ట‌ర్‌లో సుష్మాస్వ‌రాజ్‌కు ఫిర్యాదు


త‌న‌ను వివాహం చేసుకున్న 40 రోజులకే అత్తింట్లో తనను వదిలి త‌న భ‌ర్త‌ న్యూజిలాండ్‌ వెళ్లిపోయాడని, త‌న‌కు న్యాయం చేయాల‌ని పంజాబ్‌కి చెందిన చాంద్‌దీప్‌ కౌర్ అనే యువ‌తి కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్‌ను ట్విట్ట‌ర్ ద్వారా సాయం కోరింది. త‌న భ‌ర్త మ‌ధ్య‌లో ఓ సారి వ‌చ్చి మళ్లీ వెళ్లిపోయాడ‌ని, ఈ విష‌య‌మై అత్తింటివారిని అడిగితే.. ‘వాడిని ఎప్పుడో వదిలేశాం. ఇక నీకూ ఇక్కడ ఉండాల్సిన పనిలేదు వెళ్లిపో’ అని గెంటేశారని ఆమె తెలిపింది. త‌న భ‌ర్త‌ను ఎలాగైనా న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు రప్పించాల‌ని, అటువంటి ఎన్నారైలకు బుద్ధి చెప్పాలని ఆమె కోరింది.  

న్యూజిలాండ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ర‌మ‌ణ్‌దీప్‌తో ఆ యువ‌తికి 2015లో వివాహం జరిగింది. అనంత‌రం న్యూజిలాండ్‌ వెళ్లిన రమణ్‌దీప్‌ భార్యతో మాట్లాడడం మానేశాడు. దీంతో ఆమె 2016లో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా లాభం లేకపోయింది. ఇప్పటివరకు రమణ్‌దీప్‌ భారత్‌కు రాలేదు. దీంతో ఆమె ఈ విష‌యాన్ని సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో పంజాబ్‌ పోలీసులు రమణ్‌దీప్‌పై పీవో కూడా జారీచేశారు.

  • Loading...

More Telugu News