: అపరిశుభ్ర మాంసం వడ్డిస్తున్నారు.. హైదరాబాద్ రాయల్‌ప్యాలెస్ హోటల్‌కు జరిమానా
హైదరాబాద్‌లో అపరిశుభ్ర ఆహారం సర్వ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం అధికారులు కొరడా ఝుళిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు హోటళ్లకు జరిమానా విధించి, మరికొన్ని హోటళ్లను పూర్తిగా మూయించిన అధికారులు ఈ రోజు మరికొన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహించి, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలోనే పంజాగుట్ట రాయల్‌ప్యాలెస్‌లో తనిఖీలు జరిపి, అక్కడ మాంసాన్ని అపరిశుభ్రంగా ఎక్కువ కాలం నిల్వ ఉంచి వినియోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. కాలం చెల్లిన ఆహారాన్ని ఇస్తున్న రాయల్‌ప్యాలెస్ హోటల్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు.