: అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం రెడీ: ఉత్తరకొరియా
వరుసబెట్టి క్షిపణి ప్రయోగాలను చేస్తూ జపాన్, దక్షిణకొరియా దేశాల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఉత్తరకొరియా తాజాగా అమెకాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమను బెదిరించడానికో, అదుపులో పెట్టడానికో సిరియాపై అమెరికా దాడులు చేస్తోందని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి అన్నారు. తమతో యుద్ధం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నట్టైతే... అందుకు తాము సిద్ధమని చెప్పారు. ఎలాంటి తరహా యుద్ధానికైనా తాము సన్నద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.