: స్కూల్‌కు వెళ్ల‌నంటూ వాట‌ర్ ట్యాంక్ ఎక్కి బెదిరించిన బాలుడు


స్కూల్‌కు వెళ్ల‌నంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు వాట‌ర్ ట్యాంక్ ఎక్కి బెదిరించిన ఘ‌ట‌న కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రానగర్‌లో చోటు చేసుకుంది. తనకు చ‌దువుకోవ‌డం ఇష్టం లేద‌ని, త‌మ త‌ల్లిదండ్రులు మాత్రం స్కూలుకి వెళ్లాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ని ఆ బాలుడు వాట‌ర్ ట్యాంక్‌పై నుంచే చెప్పాడు. త‌న‌ను స్కూలుకి వెళ్లాల‌ని చెబితే తాను దూకేస్తాన‌ని అన్నాడు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు ఆ బాలుడికి న‌చ్చ‌జెప్పి వాట‌ర్ ట్యాంక్ దిగేలా చేశారు. ఆ బాలుడు స్థానిక స్కూల్‌లో మూడో త‌ర‌గ‌తి చదువుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఆ విద్యార్థి త‌ల్లిదండ్రులు మంత్రాల‌యానికి ఉపాధి నిమిత్తం వచ్చి అక్క‌డే నివ‌సిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News