: ఆర్కేనగర్ లో స్వతంత్ర అభ్యర్థుల ధర్నా.. అరెస్ట్


శశికళ వర్గానికి చెందిన వారు రూ. 89 కోట్లు పంచిపెట్టినట్టు ఐటీ శాఖకు ఆధారాలు దొరకడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు ధర్నాకు దిగారు. అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్ మాత్రమే డబ్బులు పంచాడని, ఎన్నికల్లో అతన్ని మాత్రమే అనర్హుడిగా ప్రకటించి, ఎన్నికలను నిర్వహించి ఉంటే బాగుండేదని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో ధర్నాకు దిగిన అభ్యర్థులతో పాటు వారితో పాటు ధర్నాకు దిగిన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News