: ఆయేషా మీరా హత్య కేసును తిరగదోడాలి.. అసలైన దోషులను పట్టుకోవాలి: నన్నపనేని డిమాండ్


ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, కేసును మళ్లీ తిరగదోడాలని డిమాండ్ చేశారు. ఆయేషాను హత్య చేసిన అసలైన దోషులను పట్టుకోవాలని అన్నారు. లైంగిక దాడులు, యాసిడ్ దాడులు చేసిన వారిని ముసుగులు లేకుండా నడిపించి తీసుకెళ్లాలని చెప్పారు. నిందితులకు స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వరాదని అన్నారు. అవసరమైతే నిందితుల ఆస్తులను అటాచ్ చేసి, బాధితురాలికి నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. టీవీ సీరియళ్లలో మహిళలను విలన్లుగా చూపించడం దారుణమని అన్నారు.

  • Loading...

More Telugu News