: ఎన్డీఏ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!


ఎన్డీఏ ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా లేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, ప్రస్తుత సమస్యలకు గత ప్రభుత్వాలే కారణమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మొదటిసారి కాంగ్రెస్సేతర ప్రధానికి పూర్తి మద్దతు లభించిందని, మోదీకి ప్రజల మద్దతు ఉందనడానికి యూపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

మొదటిసారి ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, దానికి మోదీయే కారణమని, అన్ని రంగాల్లో ఎన్డీయే కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. గడచిన మూడేళ్లలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేవని, ఇది.. ఈ ప్రభుత్వ విజయమని ప్రశంసలతో ముంచెత్తారు. నోట్ల రద్దు, డిజిటలైజేషన్, జీఎస్టీ, డిజిటల్ పేమెంట్స్ ఎన్డీయే హయాంలో సాధించిన అతిపెద్ద విజయాలని, రెండంకెల వృద్ధి రేటు సాధించేది ఒక్క భారత్ మాత్రమేనని, స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే స్థిరమైన అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News