: మనీలాండరింగ్ కేసులో.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి బిగుస్తున్న ఉచ్చు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కష్టాలు మరింత పెరిగాయి. మనీలాండరింగ్ కేసులో ఉచ్చు మరింత బిగుస్తోంది. విచారణ నిమిత్తం ఈ నెల 13న తమ ముందు హాజరు కావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు మరోసారి సమన్లు పంపింది. గతంలో కూడా ఈయనకు ఈడీ సమన్లు పంపింది. అయితే, అనారోగ్య కారణాల కారణంగా తాను విచారణకు హాజరుకాలేనంటూ ఆయన ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈడీ మరోసారి సమన్లు పంపింది.
రూ. 10 కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వీరభద్ర సింగ్, ఆయన భార్య, మరికొందరిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 2009-2011 మధ్య కేంద్ర ఉక్కు మంత్రిగా ఉన్న సమయంలో రూ. 6.1 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. మరోవైపు మనీలాండరింగ్ చట్టం కింద రూ. 14 కోట్ల ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.