: ఢిల్లీలో మోదీతో మమతా బెనర్జీ సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల మమతా బెనర్జీ పలు సందర్భాల్లో మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీలో మోదీతో భేటీ కావడం ఆసక్తి రేపింది. కేంద్ర సర్కారు ప్రవేశ పెట్టిన పథకాల కింద పశ్చిమ బెంగాల్‌కి రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని మోదీని ఆమె కోరారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు రావాల్సిన నిధులను విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని మోదీ చెప్పారని తెలిపారు. పశ్చిమబెంగాల్ సమస్యల గురించి చర్చించినట్లు చెప్పారు. భారత్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. తీస్తా నీటి పంపిణీకి సంబంధించి సత్వర పరిష్కారం కనుగొంటామని పేర్కొన్న అంశంపై మమత మాట్లాడుతూ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.