: మన నేవీ చేసిన సాయాన్ని మరచి.. సొంత డబ్బా కొట్టుకున్న చైనా!
మలేషియా, పోర్ట్ ఆఫ్ అదెన్ మధ్య 21 వేల టన్నుల ఆ కార్గో షిప్ ప్రయాణిస్తున్న సమయంలో నిన్న సముద్రపు దొంగలు ఒక్కసారిగా దాడికి దిగి, ఆ ఓడను చోరీ చేయాలని చూసిన విషయం తెలిసిందే. అయితే, యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అలెర్ట్ పంపించడంతో భారత నేవీ ఈ విషయంపై అందరికంటే ముందుగా స్పందించి యుద్ధనౌకలు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ తర్కాష్‌లను రంగంలోకి దింపి, అనంతరం ఓ హెలికాఫ్టర్‌ను కూడా పంపించి, ఆ ఓడను కాపాడే ప్రయత్నం చేసింది. అనంతరమే చైనీస్ నేవీ తమ నౌకను పంపి తమ బలగాలను ఆ ఓడలోకి చేర్చింది. అయితే, ఈ విషయంపై ఈ రోజు మరోసారి స్పందించిన చైనా తమ తీరుని ప్రదర్శించింది. భారత నేవీ చేసిన సాయాన్ని విస్మరించింది. సొమాలీ పైరేట్స్ నుంచి తువాలుకు చెందిన కార్గో షిప్‌ను తామే రక్షించినట్లు ప్రకటించుకుంది. అందుకు సాయపడిన భారత్ పేరును కావాలనే ప్రకటనలోంచి తొలగించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. పైరేట్లకు వ్యతిరేకంగా పోరాటంలో తమ నేవీ సత్తా ఏంటో ఈ ఘటన ద్వారా తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు. ఇండియన్ నేవీ పేరును ఎందుకు ప్రస్తావించలేదని ఆయనను ప్రశ్నించగా, ఆ విషయాన్ని తమ రక్షణ శాఖను అడగాలని అన్నారు.