: ఉదయభాను ప్రస్తుతం ఏం చేస్తోందంటే...!
తన అందం, అభినయం, వాక్చాతుర్యంతో బుల్లి తెరను యాంకర్ ఉదయభాను కొన్ని ఏళ్ల పాటు ఏలేసింది. అదపాదడపా కొన్ని సినిమాల్లో సైతం మెరిసింది. అయితే, గత రెండేళ్ల నుంచి ఆమె కనిపించడం మానేసింది. ఉదయభాను ఎక్కడుంది? ఏ చేస్తోంది? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
ఉదయభాను ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఆమె భర్త నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనతోనే సమయమంతా గడిచిపోతోందని భాను తెలిపింది. ఇప్పట్లో మళ్లీ బుల్లితెరపై కనిపించే ఆలోచన లేదని... పిల్లలకు కొంత వయసు వచ్చేదాకా వారితోనే గడుపుతానని చెప్పింది. ఆ తర్వాతే కెరీర్ గురించి మళ్లీ ఆలోచిస్తానని తెలిపింది. ఇటీవలే ఓ అవార్డ్స్ ఫంక్షన్ కు భర్తా పిల్లలతో కలసి ఉదయభాను హాజరైంది. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోనే ఇది.