: ఢిల్లీలో జగన్ కు చేదు అనుభవం?
వైసీపీ అధినేత జగన్ కు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైనట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ఢిల్లీలోని పలువురు రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని జగన్ భావించారు. అయితే, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ సీనియర్ నేతలు జగన్ కు సూచించారట. అయినా కూడా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
అయితే, జాతీయ స్థాయి నేతల నుంచి జగన్ కు ఊహించని పరాభవం ఎదురైందని సమాచారం. కొన్ని పార్టీల నేతలు జగన్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట. దీంతో, రాష్ట్రపతితో పాటు అరుణ్ జైట్లీ, ములాయం సింగ్ యాదవ్, వామపక్ష నేతలను మాత్రమే కలుసుకుని జగన్ వెనుదిరిగారట. జాతీయ స్థాయి నేతల స్పందనతో వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారని చెబుతున్నారు.