: సౌదీ అరేబియా ప్రజలు, కంపెనీలు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు!
సాధారణంగా ఏ ప్రభుత్వాలైనా ప్రజలు కట్టే ఆదాయపు పన్నుతోనే సగం ఖర్చును భరిస్తుంటాయి. ఇన్ కం ట్యాక్స్ లేకపోతే ప్రభుత్వాలు నడవడం చాలా కష్టం. అయినప్పటికీ సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రజలు ఇకపై ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. కంపెనీలు కూడా తమ లాభాలపై ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. అఖండ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు, వ్యాట్ కూడా 5 శాతానికి మించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది.