: టీవీ న్యూస్ ప్రజెంటర్లను లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాదులు
ఇంతవరకు ప్రముఖ నేతలు, కంపెనీల అధినేతలు, ప్రభుత్వాలకు సహకరించే వారినే టార్గెట్ చేస్తూ వస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పుడు టీవీ న్యూస్ ప్రజెంటర్లను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. దీనిపై జర్నలిస్టుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ కేసును విచారణకు స్వీకరించారని డైలీస్టార్ రిపోర్టులో పేర్కొన్నారు. ఉగ్రవాదులు బీబీసీ, స్కై న్యూస్ లోని ప్రముఖ బ్రిటీష్ టెలివిజన్ జర్నలిస్టులపై దాడులు జరపాలని చూస్తున్నారని అందులో ఉంది. అందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.
ఆయా మీడియా సంస్థల జర్నలిస్టుల పేర్లను ఐఎస్ఐస్ తమ వెబ్ సైట్లో పేర్కొంది. అంతేగాక, పలు పర్యాటక ప్రదేశ ప్రాంతాల్లో కూడా దాడులు చేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా డౌనింగ్ స్ట్రీట్, బిగ్ బెన్, వెస్ట్ మిన్ స్టర్ తో పాటు పలు ప్రాంతాలు వారి లక్ష్యంగా ఉన్నాయి. ఇక మిగతా జాబితాల్లో బ్రిటీష్ ఎంపీలు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ భవంతులు, ఆర్మీ బేస్ లు, ఎయిర్ పోర్టులు ఉగ్రవాదుల లక్ష్యంగా ఉన్నాయి.