: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు.. భద్రక్‌లో అల్లర్లు.. సోషల్ మీడియాపై నిషేధం


ఒడిశాలోని భద్రక్‌ పట్టణంలో అల్లర్లు చెలరేగడంతో పోలీసులు ఆ ప్రాంతంలో ప‌లు ఆంక్ష‌లు విధించారు. ఫేస్‌బుక్‌, వాట్స‌ప్, యూ ట్యూబ్ లాంటి సామాజిక మాధ్య‌మాల ప్లాట్ పాంల‌ను 48 గంట‌ల‌పాటు నిలిపివేశారు. వాటిల్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన పోస్టుల కారణంగా గతవారం భద్రక్‌లో పెద్ద ఎత్తున‌ అల్లర్లు చెలరేగాయి. అటువంటి పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్‌ చేయాలని నాలుగు రోజుల‌ క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

దీంతో సుమారు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ అక్కడి ప‌రిస్థితుల‌పై అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతున్నారు.  ఆ పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ శాంతి భద్రతల స‌మ‌స్య త‌లెత్త‌కుండా సోషల్‌ మీడియాపై నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News