: 42 వేల అడుగుల ఎత్తులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
42 వేల అడుగుల ఎత్తులో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... గినియా రాజధాని కోనార్కి నుంచి టర్కీలోని పెద్ద పట్టణమైన ఇస్తాంబుల్ కు టర్కీష్ ఎయిర్ లైన్స్ లో నఫి డయాబి (28) అనే గర్భిణి బోర్డింగ్ చేసింది. డెలివరీకి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో ఆమె బయల్దేరింది. అయితే ఊహించని విధంగా విమానం గాల్లో లేచిన కాసేపటికే ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు కలిసి ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ బిడ్డతో విమాన సిబ్బంది ఫోటోలు దిగారు.