: బాలకృష్ణ నుంచి అవార్డు స్వీకరించిన మాస్టర్ ఎన్టీఆర్!


నందమూరి వంశంలో నాలుగో తరం సినీ రంగంలో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది. తెలుగు సినీ ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు వారసత్వాన్ని బాలకృష్ణ, హరికృష్ణ పుణికిపుచ్చుకున్నారు. వీరిలో బాలకృష్ణ స్టార్ హీరోగా నీరాజనాలు అందుకున్నారు. ఆ తరువాత వారి వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న అందుకోగా, త్వరలో వీరి సరసన మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనుండగా, ఆ తరువాతి తరం నటుడిగా రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. మొన్న వైజాగ్ లో జరిగిన సినీ అవార్డుల వేడుకలో ఈ చిన్నారి బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు.

బాలలతో రూపొందించిన 'దానవీర శూరకర్ణ' సినిమాకు గాను మాస్టర్ ఎన్టీఆర్ ను పురస్కారానికి ఆహ్వానించగా... సీట్ నుంచి లేచిన మాస్టర్ ఎన్టీఆర్.. తాతయ్య బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి వేదికనెక్కాడు. అనంతరం తాతయ్య బాలకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు. మనవడికి అవార్డు ఇస్తున్న సమయంలో బాలకృష్ణ ముఖంలో ఆనందంతో వెలిగిపోయింది.

  • Loading...

More Telugu News