: ఇప్పటి ఆర్టిస్టులు వెరీ లక్కీ: నటి రాశి


గతంతో పోల్చుకుంటే ఇప్పటి ఆర్టిస్టులు వెరీ లక్కీ అని నాటి అందాల నటి రాశి చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘పద్నాలుగు సంవత్సరాల వయసులోనే నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అవకాశాలు పుష్కలంగా ఉండేవి..తీరిక లేకుండా పని చేశాను. రెండేళ్ల పాటు అయితే, తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా  నా పేరు ఉండేది. ఏడాదికి ఎనిమిది నుంచి తొమ్మిది చిత్రాల వరకు ఉండేవి.

ప్రస్తుతానికి వస్తే, సినిమా ఏవరేజ్ ఆడితేనే పెద్ద హిట్ అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఒకప్పటిలా, ఇప్పటి ఆర్టిస్టులు డే అండ్ నైట్ వర్క్ చేయడం లేదు. అప్పుడు మేము డిమాండ్స్ ఏమీ చేయలేదు. కార్ వాన్స్ లేవు... ఇప్పుడున్న ఆర్టిస్టులు వెరీ లక్కీ. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రెమ్యూనరేషన్స్ లో కూడా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వుంది... పన్నెండు సంవత్సరాల   గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కల్యాణ వైభోగమే. ప్రస్తుతం ‘లంక’ చిత్రంలో నటిస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టయింది’ అని రాశి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News