: రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెస్తాం: బసవతారకం కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ


హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో మరో మూడు నెలల్లో రోబోటిక్  సర్జరీని అందుబాటులోకి తీసుకు వస్తామని ఆ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ వెల్లడించారు. ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన భవనాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, తన తల్లి కోరిక మేరకు తండ్రి ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని నిర్మించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ ట్రస్టు ఆసుపత్రి ‘నో ప్రాఫిట్ .. నో లాస్’తో నడుస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News