: రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ స్థలంలో మంటలు.. కాలి బూడిదైన కార్లు
ఒక్కసారిగా మంటలు వ్యాపించి పార్కింగ్‌లో ఉన్న కార్లన్నీ కాలి బూడిదయిపోయిన ఘటన రాయ్‌పూర్‌లోని ఓ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఇంకా స్పష్టత రాలేదు.