: అమరావతిలో 20 ఎకరాల్లో స్మృతివనం.. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని శాఖమూరు-ఐనవోలు మధ్య 20 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు కానుంది. మెమోరియల్ హాల్, ధ్యానమందిరం, మెమోరియల్ గార్డెన్, బస్ పార్కింగ్, కన్వెన్షన్ హాల్, యాంపీ థియేటర్, గ్రంథాలయం, బహిరంగ ప్రదర్శనశాల నిర్మించనున్న స్మృతివనంలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ లైటింగ్, సౌండ్ షోలు ఏర్పాటు చేయనున్నారు. లింగాయపాలెంలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రభుత్వ భవనాల సముదాయానికి అభిముఖంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.