: దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలి.. చంద్రబాబు సరికొత్త ప్రతిపాదన


దేశంలో అభివృద్ధి జరగాలంటే అన్ని ఎన్నికలను ఒకేసారి జరపడం మంచిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం సింహాచలం ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి తర్వాత ఆరు నెలలకు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేస్తే అభివృద్ధికి ఆటంకం ఉండదన్నారు.

ఒక్కో ఎన్నికను ఒక్కోసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి పనులకు ఎన్నికల నియమావళి అడ్డం వస్తోందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. తన ప్రతిపాదనపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్టణాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా, సైబర్ సెక్యూర్డ్,  నాలెడ్జ్ ఎకానమీ, టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చామని, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తే పదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. విశాఖకు తొందర్లోనే ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News