: నన్ను ఎందుకు ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు?: అధికారులను ప్రశ్నించిన జీవన్ రెడ్డి
తనను అధికారులు శాసనసభ్యుడిగా గుర్తించడం లేదని సీఎల్పీ ఉపనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ, తనను ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు ఆహ్వానించడం లేదని మండిపడ్డారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అధికారిక కార్యక్రమాలకు అధికార పార్టీ నేతలను ఆహ్వానిస్తున్న అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అయిన తనను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.