: ఆహార భద్రతకు చంద్రబాబు ముప్పు కలిగిస్తున్నారు: మేథాపాట్కర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానిలోని అసైన్డ్ భూములన్నీ ప్రభుత్వ భూములేనంటూ చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారని ఆమె విమర్శించారు. 2013 భూసేకరణ చట్టానికి మార్పులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. రైతులు, రైతు కూలీలు, ప్రజా సంఘాల ఉద్యమాలతో 2013 భూసేకరణ చట్టం ఏర్పడిందని తెలిపారు. బంగారంలాంటి భూములను చంద్రబాబు లాక్కొంటున్నారని... ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు.