: ఈ సాయంకాలమైనా బాలయ్య, నాగార్జునలు కలుస్తారా?


ఎన్టీఆర్, ఏఎన్నార్ లు చివరి వరకు మంచి మిత్రులుగానే ఉన్నారు. వృత్తి పరంగా పోటీ ఉన్నప్పటికీ, వారి స్నేహం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. వారిద్దరి వారసులు బాలకృష్ణ, నాగార్జునలు కూడా మంచి మిత్రులే. కానీ, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏమాత్రం సాన్నిహిత్యం లేదు. కారణాలు ఏంటనేది క్లియర్ గా తెలియనప్పటికీ... వీరిద్దరి మధ్య స్నేహం ఇంతకు ముందులా లేదనేది మాత్రం నిజం. కొన్ని రాజకీయ విభేదాలు ఇద్దరి మధ్య తలెత్తాయని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ, వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొందరు యత్నించినప్పటికీ, అది సఫలం కాలేదు.

ఇప్పుడు వీరిద్దరూ కలిసే అవకాశం వచ్చింది. ఈ సాయంకాలం విశాఖపట్నంలో టి.సుబ్బరామిరెడ్డి అవార్డుల వేడుక జరగనుంది. టీఎస్సార్ ప్రకటించిన అవార్డుల జాబితాలో బెస్ట్ హీరోగా బాలయ్య, బెస్ట్ యాక్టర్ గా నాగార్జున చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో, అవార్డుల వేడుకకు వీరిద్దరూ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో అయినా వీరిద్దరూ మాట్లాడుకుంటారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. 

  • Loading...

More Telugu News