: బుద్ధి మార్చుకోని శివసేన ఎంపీ!


శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ బుద్ది ఏ మాత్రం మారలేదు. తాను చెప్పుతో కొట్టిన ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ కు ఎట్టి పరిస్థితుల్లోను క్షమాపణ చెప్పనని ఆయన అన్నారు. అంతేకాదు, తనను అవమానించిన సుకుమార్ పిచ్చోడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన చర్యల వల్ల పార్లమెంటు గౌరవానికి భంగం వాటిల్లితే... పార్లమెంటుకు మాత్రం క్షమాపణలు చెబుతానని తెలిపారు. తన మీది విధించిన ఫ్లయింగ్ బ్యాన్ కు అర్థం లేదని అన్నారు. ఏ ప్రయాణికుడినీ బ్యాన్ చేసే అధికారం ఎయిర్ లైన్స్ సంస్థలకు లేదని ఆయన మండిపడ్డారు. ఒక ఎంపీ విషయంలోనే ఎయిరిండియా ఇలా ప్రవర్తిస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మరోవైపు గైక్వాడ్ మీద నిషేధం ఎత్తివేయాలంటూ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నుంచి విన్నపం అందడంతో... ఆయనపై విధించిన నిషేధాన్ని ఎయిరిండియా ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News