: చిరంజీవి జీవితంపై ఓ సినిమా తీస్తే బాగుంటుంది: నటుడు బెనర్జీ
చిరంజీవి జీవితంపై ఓ సినిమా తీస్తే బాగుంటుందని ప్రముఖ క్యారెక్టర్ నటుడు బెనర్జీ అన్నాడు. మిస్టర్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ‘నాకు వచ్చిన ఆలోచన చెబుతున్నాను. చిరంజీవిగారి జీవిత చరిత్రను సినిమాగా తీస్తే బాగుంటుంది. సినీ రైటర్స్ .. చిరంజీవి గారి పర్మిషన్ తీసుకుని సినిమా తీస్తే బాగుంటుంది. చిరంజీవి గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన పయనాన్ని సినిమాగా తీయాలి. ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.