: గుజరాత్ ను కుదురుకోనీయని కుల్ దీప్ యాదవ్


రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మన్ ను కుల్ దీప్ యాదవ్ కుదురుకోనీయడం లేదు. తొలుత కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డ జాసన్ రాయ్ (14) ను పియూష్ చావ్లా పెవిలియన్ కు పంపాడు. వరుస బౌండరీలతో ఫాం అందుకుంటున్న మెక్ కల్లమ్ (35) ను కుల్ దీప్ యాదవ్ అవుట్ చేశాడు.

తరువాత మరో ఓవర్ లో రెండు సిక్సర్లతో దూకుడు చూపిన ఆరోన్ ఫించ్ (15) ను అవుట్ చేశాడు. సురేష్ రైనా (33) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ పరుగులు రాబడుతున్నాడు. అతనికి దినేష్ కార్తీక్ (1) జత కలిశాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ రెండు వికెట్లతో రాణించగా, పియూష్ చావ్లా ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు. 

  • Loading...

More Telugu News