: ట్రెంట్ బోల్ట్ కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన జాసన్ రాయ్


ఐపీఎల్ సీజన్-10లో నాలుగో టీ20 ప్రారంభమైంది. రాజ్ కోట్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో గుజరాత్ లయన్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచ్ లతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపై ఆసక్తి రేగుతోంది. కాగా, గుజరాత్ లయన్స్ జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. జాసన్ రాయ్ (13) కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన ట్రెంట్ బోల్ట్  కు రెండు బౌండరీలతో స్వాగతం పలికాడు. తరువాతి ఓవర్ వేసిన పియూష్ చావ్లా బౌలింగ్ లో మరో బౌండరీ బాది ఉద్దేశం చాటాడు. మరో ఎండ్ లో మెక్ కల్లమ్ (1) బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ లయన్స్ 16 పరుగులు చేసింది. 

  • Loading...

More Telugu News