: దక్షిణ భారతీయులంతా నల్లగా ఉండరు: బీజేపీ నేత వ్యాఖ్యలకు డీఎంకే నేత కౌంటర్
దక్షిణ భారతీయులంతా నల్లగా ఉంటారని, తాము జాత్యహంకారులమైతే వారితో ఎలా కలిసి ఉంటామని ఆల్ జజీరా చానెల్ తో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దక్షిణ భారత ప్రజలంతా నల్లగా ఉండరని చెప్పారు. తమ పార్టీ అధినేత కరుణానిధి, దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తెల్లగా (ఫెయిర్ గా) ఉంటారని అన్నారు. కాగా, అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తరుణ్ విజయ్ క్షమాపణలు చెప్పారు. తాను చెప్పాలనుకున్నది సరిగ్గా అన్వయించలేకపోయానని తరుణ్ విజయ్ తెలిపారు.