: ట్రంప్ చర్యతో అమెరికా, రష్యాల మధ్య అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది: అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ


సిరియాలో 80 మందికి పైగా బలిగొన్న రసాయన దాడికి ప్రతిగా షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా ఈ రోజు క్షిపణులతో దాడి చేసిన అంశంపై ప‌లు దేశాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ చ‌ర్య‌పై హవాయిన్‌ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమొక్రాట్‌ తులసీ గబార్డ్ స్పందించారు. ఈ దాడిని ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా చేశార‌ని అన్నారు. ఈ దాడులు జ‌రిపితే త‌ద‌నంత‌రం జ‌రిగే ప‌రిణామాలపై ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే డొనాల్డ్ ట్రంప్ ఈ చ‌ర్య‌కు దిగార‌ని అన్నారు. అసలు ఇటీవ‌ల‌ సిరియాలో జరిగింది ర‌సాయ‌న‌ దాడులా? కాదా? అని కూడా నిర్ధారించుకోకుండానే క్షిప‌ణిదాడులు నిర్వ‌హించార‌ని విమ‌ర్శించారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఈ పని త‌న‌కు ఎంతో బాధను, ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పారు. ఈ చ‌ర్య అల్‌ఖైదా ఉగ్ర సంస్థ‌ను మరింత బలోపేతం చేసేలా ఉంద‌ని అన్నారు. సిరియాలో ఎంతో మంది శ‌రణార్థులుగా మారే ప‌రిస్థితులు తెచ్చార‌ని అన్నారు. అంతేగాక‌, అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉంద‌ని తులసీ గబార్డ్ అన్నారు.

  • Loading...

More Telugu News