: ఈ రాష్ట్రంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే: విద్యార్థులకు ఉత్తరాఖండ్ కొత్త రూల్


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యను అభ్యసించాలని భావిస్తే, వందేమాతరం, జనగణమన పాడాల్సిందేనని విద్యామంత్రి ధన్ సింగ్ రావత్ స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని రూర్కేలో జరిగిన ఓ సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. "మీరు ఉత్తరాఖండ్ లో ఉండాలని భావిస్తే, వందేమాతరం పాడాల్సిందే" అని ఆయన అన్నారు. ప్రతి రోజూ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు జనగణమన, సాయత్రం 4 గంటలకు వందేమాతరం పాడాలని ఆయన అన్నారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల మధ్య తేడా తెలిసేలా కొత్త డ్రస్ కోడ్ ను సైతం రాష్ట్రంలో అమలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News