: ప్రతీకార చర్యలు తప్పవు: సిరియా విషయంలో అమెరికాకు రష్యా గట్టిగా హెచ్చరిక


సిరియాలో అమాయ‌కుల‌పై జ‌రిగిన ర‌సాయ‌న దాడుల‌కు ప్ర‌తీకారం అంటూ షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా ఈ రోజు ఉద‌యం క్షిపణులను ప్రయోగించిన విష‌యం తెలిసిందే. అయితే, సిరియా విష‌యంలో జోక్యం చేసుకోకూడ‌ద‌ని అమెరికాను ర‌ష్యా నిన్ననే హెచ్చ‌రించింది. సిరియాలో అమెరికా సైనిక దాడులు జరిపితే ప్రతీకార చర్యలు తప్పవని గ‌ట్టిగానే హెచ్చరిక‌లు జారీ చేసింది. నిన్న‌ రష్యా రాయబారి వ్లాదిమిర్ సఫ్రోన్‌కోవ్‌ ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇరాక్, లిబియా దేశాల విషయంలో అమెరికా అనుసరించిన తీరుని కూడా ఆయ‌న గుర్తు చేశారు. అయితే, ఈ రోజు అమెరికా దాడులు జ‌రిపిన అంశంపై ఇక ర‌ష్యా ఎలా స్పందిస్తుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది.

  • Loading...

More Telugu News