: పులివెందులలో వైయస్ వివేకా భారీ బైక్ ర్యాలీ


వైసీపీ అధినేత జగన్ బాబాయ్, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి పులివెందులలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 'సేవ్ డెమోక్రసీ' పేరుతో టీడీపీ ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిని నిరసిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగుతోంది. ఈ బైక్ ర్యాలీలో భారీ ఎత్తున వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, రాజంపేట పాత బస్టాండ్ వద్ద వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు పోలా శ్రీనివాసులు రెడ్డి, ఆకేపాటి మురళీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News