: టెన్షన్.. టెన్షన్.. జగన్ బెయిల్ కొనసాగుతుందా? రద్దు అవుతుందా?
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ బెయిలును రద్దు చేయాలనే పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. జగన్ తరపు న్యాయవాదులు ఈ రోజు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. సాక్షి మీడియాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎస్ గా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం కావడంతో... జగన్ బెయిలు రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయంటూ తన పిటిషన్ లో సీబీఐ పేర్కొంది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతోందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.