: జూలై నెలకు సంబంధించి భారీ సంఖ్యలో ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవెంకటేశ్వరునికి ఆర్జిత సేవలను చేయించాలనుకునే భక్తులకు శుభవార్త. ఈ నెలలో మొత్తం 58,067 టికెట్లను టీటీడీ ఈ ఉదయం విడుదల చేసింది. వీటిని ఆన్ లైన్ విధానంలో ఉదయం 11 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. వీటిల్లో సుప్రభాత సేవ 6,542, తోమాల సేవ 120, అర్చన 120, విశేషపూజ 1,875, అష్టదళ పాద పద్మారాధనం 60, నిజపాద దర్శనం 1,500, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3,000, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, వసంతోత్సవం 12,900, సహస్ర దీపాలంకార సేవకు సంబంధించిన 14,250 టికెట్లు ఉన్నాయి.