: జియోకు భారీ షాకిచ్చిన ట్రాయ్.. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ ఎత్తివేయాలని ఆదేశం.. అలాగేనన్న జియో!
రిలయన్స్ జియోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ పేరుతో రూ.303, అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే ప్రస్తుత ఆఫర్ మరో మూడు నెలలపాటు కొనసాగుతుందని జియో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని తాజాగా గురువారం రాత్రి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ట్రాయ్ ఆదేశాలపై స్పందించిన జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ ఉపసంహరణకు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్టు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఈ ఆఫర్‌ను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే ఇప్పటికే రూ.303 అంతకంటే ఎక్కువ చెల్లించి ఈ ఆఫర్ పొందినవారికి మాత్రం ఈ ఆఫర్ కొనసాగుతుందని జియో స్పష్టం చేసింది.