: టాస్ గెలిచిన స్మిత్... ముంబై ఇండియన్స్ బ్యాటింగ్


ఐపీఎల్ లో రెండో మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో పుణే సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. హోం గ్రౌండ్ లో విజయం సాధించాలని పూణే జట్టు పట్టుదలగా ఉంది. జట్టులో వనరులకు కొదువలేనప్పటికీ సమయానుకూలంగా రాణించాల్సి ఉంది. గత సీజన్ లో బాగా ఆడినప్పటికీ వరుస ఓటములు పూణేను పాయింట్ల పట్టికలో దిగువకు నెట్టాయి. గతానుభవాలను మర్చిపోయి ఈ సీజన్ ను ఫ్రెష్ గా విజయాలతో ఆరంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముంబై ఇండియన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో పార్థివ్ పటేల్ కు జతగా జోస్ బట్లర్ బ్యాటింగ్ కు దిగాడు. 

  • Loading...

More Telugu News