: కాంగ్రెస్ తీరు చూస్తుంటే 'షోలే గబ్బర్ సింగ్' అహింస గురించి మాట్లాడుతున్నట్టుంది! : ఆప్ నేత అశుతోష్
అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం ఎలా ఉందంటే.. ‘షోలే’ చిత్రంలో విలన్ గబ్బర్ సింగ్ అహింస గురించి ఉపన్యాసం ఇచ్చినట్టుగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ షుంగ్లూ కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆప్ పై విమర్శలు గుప్పిస్తూ, తూర్పారబడుతున్నాయి. దీంతో, ఆప్ నేత అశుతోష్ ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై పై వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ నివేదికను బయటపెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు.