: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మైఖేల్ జాక్సన్ కుమార్తె
పాప్ మ్యూజిక్ రారాజు మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. త్వరలోనే తెరకెక్కనున్న ఓ ప్రాజెక్ట్ లో రిచా ఛద్దా, పాక్ నటుడు అలీ ఫజల్ లు నటిస్తున్నారు. ఇదే సినిమాలో నటించేందుకు పారిస్ ను సినిమా యూనిట్ సంప్రదించింది. బాలీవుడ్ సినిమాలో నటించేందుకు పారిస్ ఓకే చెప్పింది. మరో విషయం ఏమిటంటే, ఈ సినిమాలో పారిస్ జాక్సన్ కు జంటగా నటించేందుకు ఓ హాలీవుడ్ నటుడిని సంప్రదిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.