: 2.9 మిలియన్ల కార్లను వెనక్కి తీసుకుంటున్న టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ
తాము గతంలో తయారు చేసిన కార్లలోని ఎయిర్ బ్యాగ్స్‌లో లోపాలను గుర్తించిన టొయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ జపాన్, చైనా, ఓసియానా, ఇతర ప్రాంతాల నుంచి మొత్తం 2.9 మిలియన్ల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్ నుంచి కూడా 23,157 యూనిట్ల సెడాన్ కొరొల్లా అల్టిస్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ కార్లను జనవరి 2010 నుంచి డిసెంబరు 2012 వరకు తయారు చేశామని తెలిపింది. ఈ కార్ల ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.15.87 లక్షల నుంచి రూ.19.91 లక్షల మధ్య ఉంది. తమ కంపెనీ వాడే ఈ కార్లలోని ఎయిర్ బ్యాగులను జపాన్‌కు చెందిన టకాటా కార్పొరేషన్ తయారుచేసిందని పేర్కొంది.