: మరోసారి పెరిగిన బంగారం ధరలు
మరోసారి బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,840కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28,200గా ఉంది. గతనెల 3వ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,480కి పడిపోయింది. కీలక వడ్డీ రేట్ల పెంపుకు అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోనుందనేే అంచనాల నేపథ్యంలో, బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో, దీని ధరలు పెరిగాయి. మరోవైపు కిలో వెండి ధర రూ. 42,370కి చేరుకుంది.