: మరింత వేగంగా పనిచేసే ‘లైట్‌’ ను తీసుకొచ్చిన ట్విట్టర్!


ఎప్ప‌టిక‌ప్పుడు తమ సైట్ లో ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ మార్పులు చేర్పులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 319 మిలియన్‌ యూజర్లను సంపాదించుకున్న ట్విట్ట‌ర్.. తాజాగా భార‌త్‌లోని తమ వినియోగదారుల ముందుకు సరికొత్త వెర్షన్‌ ‘లైట్‌’ను విడుద‌ల చేసింది. ఈ లైట్‌ను త్వ‌ర‌లోనే ఇండోనేషియా, ఫిలిపీన్స్‌ దేశాల్లో కూడా విడుదల చేయనున్న‌ట్లు తెలిపింది. బ్రౌజర్‌ ఆధారిత వెర్షన్‌ అయిన లైట్ ద్వారా సాధార‌ణ యాప్ కంటే 70 శాతం తక్కువ డేటా మాత్రమే ఖ‌ర్చవుతుంది. అంతేగాక‌, దాని కంటే 30 శాతం ఎక్కువ వేగంతో ప‌నిచేస్తుంది.  

మొత్తం 42 భాషల్లో ‘లైట్‌’ వెర్షన్‌ను తీసుకొచ్చారు. అందులో హిందీ, బెంగాలీ, తమిళ్‌, కన్నడ, గుజరాతీ, మరాఠీ భాష‌లు కూడా ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. భారత్‌ మాకు చాలా కీలకమ‌ని అన్నారు. వేగంగా వృద్ధి చెందటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగ‌దారుల‌ విషయంలో భారత్‌ ఐదో స్థానంలో ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News