: ఢిల్లీ ‘మెట్రో’ సూపర్బ్: షబానా ఆజ్మీ


ఢిల్లీ మెట్రో రైలు చాలా శుభ్రంగా, అద్భుతంగా ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ అన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి అత్యవసర పనిపై వెళ్లే నిమిత్తం తాను మెట్రో రైలు ఎక్కిన విషయాన్ని షబానా ఆజ్మీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘మెట్రో’లో ప్రయాణిస్తుండగా దిగిన ఓ ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. కాగా, అపర్ణాసేన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘సొనాటా’ చిత్రంలో షబానా ఆజ్మీ నటిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News